Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది ఏపీ హైకోర్టు. మొత్తం మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి పిటిషన్లు వేశారు.సోమవారం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. కాగా పోలింగ్ రోజు నుంచి పరారీలోనే ఉన్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి.
మూడు కేసుల వివరాలు..
* కేసు నంబర్ 1: ఈవీఎం ధ్వంసాన్ని అడ్డుకున్న శేషగిరిరావుపై దాడి
* కేసు నంబర్ 2: ప్రశ్నించిన మహిళపై దుర్భాష
* కేసు నంబర్ 3: కారంపూడి సీఐపై దాడి
ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో (AP High Court) బెయిల్ పటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఈరోజుకి తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 13న పోలింగ్ జరిగిన రోజు.. ఆ తర్వాత కూడా అల్లర్లు జరగంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.
రెంటచింతల (Rentachintala) మండలం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ నెంబర్ 202 లో టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు పై దాడి కేసులో 307 సెక్షన్‌తో పాటు మరికొన్ని సెక్టన్స్ కింద కేసు నమోదైంది. పోలింగ్ మూసిన తర్వాత రోజు కారంపూడిలో సిఐ నారాయణస్వామిపై దాడి కేసులో కూడా 307 సెక్షన్ కేసు నమోదైంది. అలాగే పాల్వాయి గేటు 202 బూత్ వద్ద చెరుకూరి నాగ శిరోమణి మీద జరిగిన దాడిపై మరి కొన్ని సెక్షన్ల కింద పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇటీవల పిన్నెల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు తాజాగా తీర్పును రిజర్వు చేస్తూ.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.