Chandrababu Naidu Case Updates: చంద్రబాబుకు బిగ్ షాక్.. తాజా అప్టేట్స్ ఇవే! టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు జరగగా.. రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. రేపు మరో సారి వాదనల అనంతరం న్యాయస్థానం ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనుంది. By Jyoshna Sappogula 09 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. చంద్రబాబు పీటీ వారెంట్ పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. అయితే.. సమయం ముగియడంతో కేసు విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు ఈ రోజు ఉదయం డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో తర్వాత ఏం చేయాలన్న అంశంపై ఆయన తరఫు లాయర్లు సమాలోచనలు చేస్తున్నారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తీర్పు పూర్తి కాపీ వచ్చిన తర్వాత హైకోర్టులో బెయిల్ పై చంద్రబాబు లాయర్లు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే.. ఈ రోజు చంద్రబాబుతో పాటు సీఐడీకి కూడా ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. చంద్రబాబును మరో సారి కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్ ను కూడా ఏసీబీ కోర్టు కొట్టేసింది. చంద్రబాబును మరింత లోతుగా విచారించడానికి కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా.. కోర్టు అంగీకరించలేదు. దీంతో సీఐడీ నెక్ట్స్ స్టెప్ ఏంటనేది కూడా ఉత్కంఠగా మారింది. Also Read: మార్చి-ఏప్రిల్లో ఎన్నికలు, ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫెస్టో #ap-ex-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి