మార్గదర్శి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై (Margadarshi) విచారణను ఏపీ హైకోర్టు 8 వారాల పాటు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తును 8 వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Sajjala Comments: చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జల సంచలన వాఖ్యలు.. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అంటూ ధ్వజం
మార్గదర్శి సహ వ్యవస్థాపకులు జేజీ రెడ్డి వారసుల మూలధన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వాటాల బదలాయింపు వ్యవహారంలో సీఐడీ (CID) తనపై నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ ఈనాడు అధిపతి రామోజీరావు (Ramoji Rao), చెరుకూరి శైలజ (Shailaja) ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు హైకోర్టులో సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళింది. అయితే ఆయన తాను విచారణ చేయలేనని చెప్పడంతో వేరే బెంచ్ కు బదిలీ చేశారు.
ఇది కూడా చదవండి: Chandrababu:ఇన్నర్ రింగ్ కేసు బెయిల్ పిటిషన్ విచారణ వచ్చేనెల 7కు వాయిదా
ఇదిలా ఉంటే.. మార్గదర్శిలో తమకు రావాల్సిన వాటా గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని గాదిరెడ్డి యూరిరెడ్డి ఫిర్యాదు చసశారు. మార్గదర్శి వ్యవస్థాపకులు జీ జగన్నాథరెడ్డి కొడుకు యూరిరెడ్డి. తన తండ్రి వాటా షేర్లు తమకు ఇవ్వకుండా రామోజీరావు మోసం చేశారని గతంలో షేర్ల గురించి అడిగితే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యూరిరెడ్డి ఫిర్యాదు మేరకు రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం కేసు నమోదు అయ్యింది.