AP High Court: వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను రేపటి వరకు యథతథంగా ఉంచాలంటూ ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

New Update
AP High Court: వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను రేపటి వరకు యథతథంగా ఉంచాలంటూ ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఏపీలో మొత్తం 10 జిల్లాల వైసీపీ కార్యాలయాలకు సంబంధించి పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీలో అనేక చోట్ల వైసీపీ కార్యాలయాలను అక్రమంగా నిర్మిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది.

ఇటీవల తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం చర్చ నీయాంశమైంది. అనంతరం వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న కార్యాలయాలకు సైతం అక్కడి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయా ఆఫీసులను సైతం కూల్చివేస్తారా? అన్న అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు