/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-High-Court-1.jpg)
ఏపీలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 16 వైసీపీ కార్యాలయాలు అక్రమ కట్టడాలంటూ ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేటస్ కోను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో వైసీపీకి తాత్కాలిక ఊరట లభించిందని చెప్పొచ్చు.