Accident: రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వడ్డెబోయిన సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది.

New Update
Accident: రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి తీవ్ర గాయాలు

Accident: సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి వడ్డెబోయిన సుజాతకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో వర్షంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి మెరుగైన చికిత్స కోసం తన కాన్వాయ్‌లో హైదరాబాద్‌కు తరలించారు. దీంతో జాతీయ రహదారి పొడవున పోలీసులు అలర్టయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు