Nara Lokesh: నారా లోకేష్ కు హైకోర్టు బిగ్ షాక్.. అరెస్ట్ ఖాయం?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌ ను ఆదేశించింది. లోకేష్‌ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది.

Nara Lokesh: నారా లోకేష్ కు హైకోర్టు బిగ్ షాక్.. అరెస్ట్ ఖాయం?
New Update

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్‌ ను ఆదేశించింది. లోకేష్‌ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు. దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని లోకేష్‌ కు చెప్పాలని అని కోరారు. ఈ నేపథ్యంలో విచారణకు సహకరించాలని లోకేష్ ను హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే.. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు 41A కింద నోటీసులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

అయితే.. లోకేష్ ఏపీకి రాగానే ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ సీఐడీ విచారణకు ఏపీకి వస్తే ఆయనను అరెస్ట్ చేయడం ఖాయమన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ అంశంపై టీడీపీ నేతలు, నారా లోకేష్ కొద్ది సేపట్లో స్పందించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి,కోడలు బ్రాహ్మణి, మాజీమంత్రి నారాయణ ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలవనున్నారు. ఈ మేరకు ఆయనతో ములాఖాత్ అయ్యేందుకు కొద్ది సేపటి క్రితం వారు లోపలికి వెళ్లారు. చంద్రబాబుతో నారా భువనేశ్వరికి ఇప్పటికే మూడు సార్లు ములాఖత్ అవ్వగాజ.. బ్రాహ్మణికి ఇది మూడోసారి. మొన్న వీరితో పాటు ములాఖాత్ లో అచ్చెంనాయుడు పాల్గొనగా, నేడు నారాయణ వెళ్లారు. యువగళం పాదయాత్ర వాయిదా, క్వాష్ పిటిషన్ అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాల పై వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:

Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రపై నారా లోకేష్ కీలక నిర్ణయం..! అరెస్ట్ భయంతోనేనా..

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe