Mobiles Ban In AP Schools: ఏపీలోని పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధం

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Mobiles Ban In AP Schools: ఏపీలోని పాఠశాలల్లో ఫోన్ల వాడకంపై నిషేధం
New Update

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులకు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులు అయితే స్కూళ్లకు ఫోన్ తీసుకురాకూడదని.. ఉపాధ్యాయులు మాత్రం ఫోన్ తీసుకువచ్చినా ప్రధానాపోధ్యాయుడు దగ్గర పెట్టాల్సిందేనని ఆదేశించింది. ఏదైనా అత్యవసరం అయితే హెడ్‌మాస్టర్ అనుమతితో ఫోన్ వాడాలని తెలిపింది. నిబంధనలు ఉల్లఘించి ఫోన్ వాడితే మాత్రం రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. చాలా పాఠశాలల్లో విద్యార్థులు రహస్యంగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారనే.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతే పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు విధించామని విద్యా శాఖ ప్రకటించింది.

విద్యావ్యవస్థలో మార్పుల దిశంగానే..

అయితే ఉపాధ్యాయులు ఫోన్ వినియోగించకుండా ఉండటం ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వారి మొబైల్స్‌లో యాప్‌లు ద్వారా పిల్లల హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం వివరాలు, పాఠశాలలో చేపడుతున్న పలు కార్యక్రమాలు వంటి ఫొటోలను ఆ యాప్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారు. కనుక వారు తరగతి గదిలో ఫోన్ వాడాల్సి ఉంటుంది. అయినా కానీ అవసరమైనప్పుడే యాప్స్‌లో వివరాలు పొందుపరిచి.. వెంటనే హెడ్‌మాస్టర్‌కు ఇచ్చేయాలని ఉన్నతాధికారులు స్పష్టంచేస్తున్నారు. విద్యా వ్యవస్దలో తీసుకువచ్చే మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయాన్ని పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

యునెస్కో మార్గదర్శకాలకు అనుగుణంగా..

పాఠశాలల్లోని తరగతి గదుల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు మొబైల్ వినియోగంపై పూర్తి స్థాయిలో నియంత్రణ ఉండాల్సిందేనని యునెస్కో ఇటీవల ప్రకటించింది. యునెస్కో ఇచ్చిన సూచనలు మేరకు ఫోన్ల వాడకం నిషేధం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్దల్లో పిల్లల విద్యా ప్రమాణాలు పెరిగేందుకు ప్రభుత్వం ఇటీవల బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎనిమిదో తరగతి విద్యార్దులకు ట్యాబ్‌లు అందించింది. అందులో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే విద్యార్థులు ఇంట్లో ఎక్కువ సమయం ఫోన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి