కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన మోదీ, పుట్టపర్తి గురుపౌర్ణమి వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్‌

శ్రీ సత్యసాయి జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయి హీర గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశ, విదేశీ భక్తులతో ప్రశాంతి నిలయంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. విదేశీ భక్తులు చేసిన సంగీత గాన కచేరిలు ఆధ్యంతం భక్తులను ఆకట్టుకున్నాయి. గురు పౌర్ణమి వేడుకలలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు.

కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించిన మోదీ, పుట్టపర్తి గురుపౌర్ణమి వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్‌
New Update

ap-governor-visit-to-puttaparti-and-celebrate-guru-pournami-and-inagurate-to-pm-modi-vartual-system

ప్రత్యక్షంగా గురు పౌర్ణమి వేడుకల ప్రారంభోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులను ఆహ్వానించి ఘనస్వాగతం పలికిన సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. సత్యసాయి మహా సమాధి చెంత గవర్నర్ పుష్ప గుచ్చాలను ఉంచి ప్రార్థించారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యసాయి భక్తుల సౌకర్యార్థం 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను సత్యసాయి ట్రస్ట్ నిర్మించింది.నేడు ఈ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై ప్రారంభించారు.

ap-governor-visit-to-puttaparti-and-celebrate-guru-pournami-and-inagurate-to-pm-modi-vartual-system2

ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సత్యసాయి బాబా సేవలను ప్రస్తుతం ట్రస్ట్ కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. సత్యసాయిబాబా నడియాడిన పుణ్యభూమికి బాబా ఆశీర్వాదం పొందేందుకు తాను తప్పకుండా వస్తాను అన్నారు.గతంలో గుజరాత్ లో భూకంపం వచ్చినప్పుడు పేద ధనిక తారతమ్యం లేకుండా సత్యసాయిబాబా అందించిన సేవలు నాకు ఎంతో స్ఫూర్తి కలిగించాయని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని దృష్టిలో పెట్టుకొని రాగిజావ పథకాన్ని సత్యసాయి ట్రస్ట్ ప్రారంభించడం అభినందనీయం. ఇదే స్ఫూర్తితో మరిన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

సత్యసాయి బాబా పేరిట ఏర్పడిన జిల్లాను డిజిటలైజేషన్ చేసేందుకు, సాంకేతిక సేవలు అందించేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జీ-20 సదస్సుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం మనకు మన సంస్కృతి సాంప్రదాయాలను శాస్త్ర సాంకేతికతను వినియోగించుకుంటే మరింత వేగంగా ముందుకెళ్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు సత్యసాయి ట్రస్ట్ అవలంభిస్తున్న సోలార్ పవర్ విధానాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.మనం ప్రారంభించిన యోగాను ప్రపంచ దేశాలు అనుసరిస్తుండడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ఇదే స్ఫూర్తితో ముందుకెళితే ప్రపంచ దేశాలకు భారత్ విశ్వ గురువుగా నిలవడం ఖాయమన్నారు.

జపాన్ లో పర్యావరణ పరిరక్షణ కోసం శాస్త్ర, సాంకేతికతతో చిన్నచిన్న అడవులను సృష్టిస్తున్నారు. హీరా, సత్యసాయి ట్రస్ట్ సంయుక్తంగా ఇలాంటి అడవులను దేశంలోనూ సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ శాంతిభవన్ లో కొద్దిసేపు విడిది చేసి రోడ్డు మార్గాన బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe