BREAKING: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం

మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. తమకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదని సమాచారం.

BREAKING: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు విఫలం
New Update

CM Jagan: మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతంలోనే హెల్త్‌ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. లేదు, తమకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వారి డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోలేదని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగించనున్నట్లు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి చెప్పినట్లు తెలుస్తోంది.

ALSO READ: ముగిసిన ప్రజాపాలన.. ఎక్కువ దరఖాస్తులు దీనికే?

అంగన్వాడీలపై సీరియస్.. 

ఏపీలో అంగన్వాడీలకు జగన్ (Jagan) సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పలు డిమాండ్లతో సమ్మె చేస్తున్న వారిపై ఎస్మా (Esma) చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేయడంతోపాటు.. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

రూ.8050 మాత్రమే

ఈ మేరకు అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది. ప్రతినెలకు ఇవ్వాల్సిన రూ. 10 వేల వేతనానికి గానూ  ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది.

ALSO READ: నాలుగు రోజులు ఇంటర్ కాలేజీలు బంద్!

#ycp-party #ap-breaking-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe