చంద్రబాబుకి ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది..జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబు ఆరోగ్యం పై ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

New Update
చంద్రబాబుకి ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు!

ఏపీ రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయి. స్కిల్ డెవలప్‌ మెంట్‌ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన్ని జైలులో ఇప్పటికే కుటుంబ సభ్యులు ములాఖత్‌ ద్వారా కలిశారు. ఆయన్ని కలిసి వచ్చిన తరువాత ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఆయన భద్రత గురించి భయంగా ఉందని పేర్కొన్నారు.

తరువాత ఆయన్ని జనసేన అధినేత కూడా ములాఖత్‌ ద్వారా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో టీడీపీ తో కలిసి జనసేన ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది..జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది.

జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబు ఆరోగ్యం పై ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆయనకు 10 మందితో వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ పది మందిలో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉంటారని తెలిపింది.

ఈ వైద్య బృందంలో ముగ్గురు డాక్టర్లు రాజమండ్రి ప్రభుత్వ ఆసుప్రతికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో ఉంటారు. వైద్య బృందంతో పాటు ఎప్పుడూ కూడా రెండు యూనిట్ల ఒ పాజిటివ్‌ రక్తాన్ని అందుబాటులో ఉంచాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా మందులు కూడా సిద్దంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇప్పుడు అత్యవసరంగా చంద్రబాబుకి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడం గురించి ఏపీ వ్యాప్తంగా .చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు