ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండానే రోడ్లపై తిరగొచ్చు

బిజీబిజీ జీవితంలో ఒక్కోసారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఇంట్లో మర్చిపోతుంటాం. ఆ సమయంలో పోలీసులు ఎక్కడ ఆపుతారో అని కంగారు పడిపోతుంటాం. ఒకవేళ పోలీసులు ఆపితే ఎక్కడ జరిమానా వేస్తారోనని భయపడిపోతాం. ఇకపై అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు. మీ దగ్గర మొబైల్ ఉంటే ఎంచక్కా రోడ్డు మీద రయ్ అని వెళ్లిపోవచ్చు.

ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండానే రోడ్లపై తిరగొచ్చు
New Update

Digital Driving Licenses in AP: ఇక నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్..

ప్రస్తుతమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. లావాదేవీలతో పాటు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియా ప్రాజెక్టును ప్రకటించింది. ప్రభుత్వ శాఖల్లో పేపర్ విధానానికి స్వస్తి పలుకుతోంది. ఈ క్రమంలోనే డిజిటల్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం దీనిని అమల్లోకి తీసుకువచ్చింది. ఇక నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను జారీ చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ఇకపై కార్డుల రూపంలో ఉండవని పేర్కొంది.

ఇక ఛార్జీలు వసూలు చేయరు..

బిజీబిజీ జీవితంలో ఒక్కోసారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ కార్డులు ఇంట్లో మర్చిపోతుంటాం. ఆ సమయంలో పోలీసులు ఎక్కడ ఆపుతారో అని కంగారు పడిపోతుంటాం. ఒకవేళ పోలీసులు ఆపితే ఎక్కడ జరిమానా వేస్తారోనని భయపడిపోతాం. అయితే డిజిటల్ విధానంలో ఇక నుంచి అలాంటి ఇబ్బంది అసలు ఉండదు. ట్రాఫిక్ పోలీసులు అడిగినప్పుడు మీ ఫోన్‌లోనే ఈ కార్డులు చూపించవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కార్డుకు రూ.200, పోస్టల్ ఛార్జి రూ.35 చెల్లించాల్సి వస్తుంది. డిజిటల్ విధానంలో కార్డు జారీ చేయడం వల్ల ఆ ఛార్జీలను రవాణాశాఖకు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. అయితే ఇప్పటికే డబ్బులు చెల్లించన వారికి మాత్రం కార్డులను అందజేయనున్నారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

రవాణాశాఖ వెబ్‌సైట్ https://aprtacitizen.epragathi.org ఓపెన్ చేయాలి. అనంతరం ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

గూగుల్‌ ప్లేస్టోర్‌లో aprtacitizen యాప్ డౌన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

వాహనాల్ని ఆపే పోలీసులతో పాటు రవాణాశాఖ అధికారులకు డౌన్‌లోడ్ చేసిన పత్రాలను చూపిస్తే చాలు.

అలాగే ఎం-పరివాహన్, డిజి లాకర్‌లోని డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్ కార్డులను కూడా చూపించవచ్చు.

వినియోగదారుడు అప్లై చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలన చేసి డిజిటల్ కార్డు జారీ చేస్తారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా డిజిటల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు జారీ చేయాలని చూస్తోంది. అయితే ఇంకా అమల్లోకి తీసుకురాలేదు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: టీటీడీ కీలక నిర్ణయం.. నడకమార్గంలో వాటికి నో పర్మిషన్!!

#ap-news #digital-driving-licenses-in-ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe