ఎంఈవోల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం వడగాల్పుల తీవ్రత దృష్ట్యా, సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు నడపాలని, ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు మాత్రమే పాఠాలు బోధించాలని, అలాగే విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం అందించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 355 ఎంఇఓ వన్ పోస్టులు ఖాళీలను సీనియర్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స వెల్లడించారు. By Shareef Pasha 19 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రాథమిక స్ధాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ ప్రొఫెసర్ల ద్వారా ఉపాధ్యాయులకి డిజిటల్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రైమరీ స్థాయిలో పదివేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ టీచర్లు ఉన్న పాఠశాలలు 9 వేలు ఉండగా.. సింగిల్ టీచర్ సెలవుపెట్టే పాఠశాలలకి అందుబాటులో ఉండేలా మండలానికి నలుగైదురు టీచర్లని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. 6వ తరగతి నుంచి పైస్థాయి వరకు ఇంటరాక్ట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నామని, విద్యా బోధనపై టీచర్లకు ఆన్‌లైన్, ఆఫ్ లైన్‌లో శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. స్కూళ్లల్లో వాచ్‌మెన్ పోస్టుల భర్తీ నాడు–నేడు పనులు జరుగుతున్న స్కూళ్లకు వాచ్‌మెన్ పోస్టులు ఇచ్చినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. కంప్యూటర్ పోస్టుల ఫైల్ కూడా మూవ్ అవుతోందని అన్నారు. ప్రభుత్వం తాలుకా ఆలోచన ఏదైతే ఉందో థర్డ్ క్లాస్ నుంచి సబ్జెట్ ఇవ్వాలని ఉందో దాన్ని మాత్రం నూటికి నూరు శాతం అమలు చేస్తామని అన్నారు.మరోవైపు నాణ్యమైన విద్యాను టీచర్లు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. డిజిటల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి టీచర్లను మోటివేట్ చేస్తున్నామన్నారు. ఇంటరాక్ట్ ఫ్యానల్ కూడా ఏర్పాటు చేస్తున్నామ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న స్కూళ్లకు ఒక్కో స్కూల్‌కు ఒక్కో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 10 టీవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. మిగతా స్కూళ్లలో కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులతో సమావేశమై ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యాం. వారి సహకారంతో విద్యా వ్యవస్ధని మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. 1.75 లక్షల మంది ఉఫాద్యాయులలో 82 వేల మంది బదిలీకి దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ అయ్యారని తెలిపారు.సీనియర్ హెడ్ మాస్టర్లని సెకండ్ ఎంఇఓలగా నియమించామని, కొత్తగా 679 మంది సెకండ్ ఎంఇఓ పోస్టులని భర్తీ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 355 ఎంఇఓ వన్ పోస్టులు ఖాళీలు ఉండగా వీటిని కూడా సీనియర్ హెడ్ మాస్టర్లతో భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి