Diwali Holidays List: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళి సెలవుల్లో మార్పులు.. మొత్తం 3 రోజులు!

దీపావళి సెలవు విషయంలో ఏపీలోని జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 13న సోమవారం సెలవు ప్రకటించింది. దీంతో విద్యార్థులకు రెండో శనివారం, ఆదివారంతో కలిపి విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

New Update
Diwali Holidays List: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళి సెలవుల్లో మార్పులు.. మొత్తం 3 రోజులు!

దీపావళి సెలవు (Diwali Holiday) విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా విడుదల చేసిన జాబితా ప్రకారం ఏపీలో దీపావళి సెలవును ఈ నెల 12న ఇచ్చారు. కానీ.. తాజాగా ఆ సెలవును ఈ నెల 13కు మార్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 13న ఆప్షనల్ హాలిడే ఉండగా.. దానిని సాధారణ సెలవుగా మార్చుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 9న రెండో శనివారం, 10న ఆదివారం వచ్చాయి. తాజాగా.. ప్రభుత్వం 13న సెలవు ప్రకటించడంతో వరుసగా మూడు రోజుల పాటు దీపావళి సెలవులు రానున్నాయి. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..

Advertisment
తాజా కథనాలు