ఆళ్లగడ్డలో అఖిలప్రియకే ఆధిక్యం..
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్, రాజకీయం కలగలసిన కీలక నియోజకవర్గం ఆళ్ళగడ్డ. వైసీపీ నుంచి గంగుల బిజేంద్రా రెడ్డి.. కూటమి తరపున భూమా అఖిలప్రియ పోటీలో ఉన్నారు. భూమా అఖిలప్రియకు చిన్న ఏజ్‌లోనే రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అయిదేళ్ళ అభివృద్దినే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ హోరాహోరీలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియకే విజయావకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
కర్నూలులో భరత్ కు ఛాన్స్..
కర్నూలులో వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 70 వేలున్నాయి. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి భరత్ పారిశ్రామిక వేత్తగా ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీవీ ఎక్స్‌క్లూజివ్ స్టడీ రిపోర్టు ప్రకారం కర్నూలు నియోజకవర్గంలో భరత్ విజయం సాధించే అవకాశం ఉంది.
డోన్ లో..
జిల్లాలో మరో ఇంట్రెస్టింగ్ సీటు డోన్.. ఇక్కడ్నించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో వున్నారు. ఆయనపై కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని బరిలోకి దింపింది కూటమి. ఆర్టీవీ స్టడీ రిపోర్టు ప్రకారం ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుటుంబ నేపథ్యం.. క్లీన్ ఇమేజ్ కోట్లకు ప్లస్ పాయింట్లు. గత అయిదేళ్ళలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రచారం నిర్వహిస్తున్నారు బుగ్గన. ఈ హోరాహోరీలో వైసీపీదే పైచేయిగా కనిపిస్తోంది. బుగ్గనకే గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
ఇతర నియోజకవర్గాల్లో..
శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి సుధీర్, పాణ్యంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర, బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి, పత్తికొండలో వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి..
కోడుమూరులో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్, ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి, ఆదోనిలో వైసీపీ అభ్యర్థి సాయిప్రతాప్ రెడ్డి, ఆలూరులో వైసీపీ అభ్యర్థి బూసినే వీరూపాక్షి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.