ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ 14 స్థానాల్లో వైసీపీ, 2 చోట్ల టీడీపీ గెలిచాయి. ఈసారి కృష్ణా జిల్లా ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, RTV స్టడీలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం.
గన్నవరంలో..
ఈ జిల్లాలో పెద్ద చర్చకు తెరతీసిన సెగ్మెంట్ గన్నవరం. వైసీపీ నుంచి వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో యార్లగడ్డ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారన్న సానుభూతి ఉంది. కూటమి బలం కూడా ఆయనకు కలిసొస్తుంది. ఫైనల్‌గా యార్లగడ్డకి ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో గన్నవరం ఓటరు ఉన్నట్టు కనిపిస్తోంది. టైట్ ఫైట్ ఉన్నా... యార్లగడ్డ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని RTV స్టడీలో తేలింది.
విజయవాడ వెస్ట్ లో..
బెజవాడలోనూ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తోంది. విజయవాడ వెస్ట్‌లో అధికార వైసీపీ నుంచి ఆసిఫ్, బీజేపీ నుంచి సుజనా చౌదరి బరిలో ఉన్నారు. కూటమి బలం సుజనా చౌదరికి కలిసొస్తోంది. మూడు పార్టీల నేతలు ఒకే తాటిపైకి రావడం సుజనాకు ప్లస్ అవుతోంది. ఆర్ధిక బలం కూడా ఆయనకు అదనపు అడ్వాంటేజ్. మొత్తానికి ఇక్కడ సుజానా గెలిచే అవకాశం ఉన్నట్లు RTV స్టడీ చెప్తోంది.
గుడివాడలో గెలుపు ఎవరిదంటే?
ఏపీ ఎన్నికల్లో హాట్‌టాపిక్‌గా ఉన్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందుంటుంది. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత, టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు ప్రధాన ప్లస్ పాయింట్. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా చేసిన సేవాకార్యక్రమాలు కూడా కలసి వచ్చే అంశం. రాము ఆర్ధిక బలం కూడా అడ్వాంటేజ్ అవుతోంది. అటు కొడాలి నాని ప్రధాన ఓటు బ్యాంక్ ఎస్‌సీ, బీసీల్లో ఓట్ల చీలిక ఆయనకి మైనస్ అవుతోంది. కాస్త టఫ్ ఫైట్ ఉన్నా వెనిగండ్ల రాము గెలిచే అవకాశం ఉందని RTV స్టడీ చెప్తోంది.
ఇతర నియోజకవర్గాల విషయానికి వస్తే..
తిరువూరులో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, నూజివీడులో వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కైకలూరులో వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు, పెడనలో వైసీపీ అభ్యర్థి ఉప్పల రాము, మచిలీపట్నంలో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ద ప్రసాద్, పామర్రులో వైసీపీ అభ్యర్థి కైలా అనిల్ కుమార్, పెనమలూరులో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్, విజయవాడ సెంట్రల్ లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
విజయవాడ ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు, మైలవరంలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, నందిగామలో వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేటలో టీడీపీ అభ్యర్థి శ్రీరాంతాతయ్య విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీవీ స్టడీలో తేలింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ 8, వైసీపీ 6, జనసేన 1, బీజేపీ 1 సీటును కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.