AP Game Changer: కాకినాడ ఎంపీగా గెలిచేది అతనే.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!

కాకినాడ ఎంపీ స్థానం నుంచి జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ తరఫున చలమశెట్టి సునీల్ పోటీ పడుతున్నారు. అయితే.. ఈ ఇద్దరిలో గెలిచేదెవరు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

AP Game Changer: కాకినాడ ఎంపీగా గెలిచేది అతనే.. ఆర్టీవీ స్టడీలో తేలిన లెక్కలివే!
New Update

తూర్పుగోదావరి జిల్లాలో కీలక ఎంపీ సీట్‌ కాకినాడ. జనసేన నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. చలమలశెట్టి సునీల్‌ ఇక్కడ వరుసగా 3 సార్లు ఓడిపోయారు. గతంలో PRP, YCP తర్వాత TDP ఇప్పుడు YCP నుంచి సునీల్‌ పోటీ చేస్తున్నారు. తన తల్లి జన్మస్థలం నుంచి ఆయన నాలుగోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే 2019లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా సునీల్‌కు 70 వేల ఓట్లు ఎక్కువగా రావడం ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. అయినా ఆయన ఓడిపోయారు.

publive-image

ఇక జనసేన అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌పై వ్యక్తిగత ఆరోపణలు లేకపోవడం ప్లస్‌. పవన్‌కల్యాణ్‌ అభ్యర్థిగా వచ్చే వరకు ఆయన పిఠాపురం ఇన్‌ఛార్జిగా ఉన్నారు. అక్కడ జనసేన నేతలతో విభేదాలు ఉదయ్‌కు మైనస్‌. పిఠాపురం అసెంబ్లీలో పవన్‌కు పడే ఓట్లలో క్రాస్‌ ఓటింగ్‌ జరగొచ్చు.

publive-image

publive-image

అది ఉదయ్‌కు ప్రతికూలంగా మారే ఛాన్స్‌ ఉంది. ఆర్థికంగా బలంగా లేకపోవడం మైనస్‌. అయినా కూటమి బలంగా ఉండటం ప్లస్‌ అవుతుంది. వైసీపీపై వ్యతిరేకత కలిసి వస్తుందని మా స్టడీలో తేలింది. ఓవరాల్‌గా కాకినాడ ఎంపీ సీటులో ఉదయ్‌ శ్రీనివాస్‌ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

publive-image

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe