AP Game Changer: విశాఖలో ఈసారి వైసీపీకి బిగ్ షాక్? ఆర్టీవీ స్టడీలో తేలిన ఊహించని లెక్కలివే!

15 సీట్లు ఉన్న విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఈ సారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? 2019 ఫలితాలను వైసీపీ రిపీట్ చేస్తుందా? కూటమి సత్తా చాటుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.

New Update
AP Game Changer: విశాఖలో ఈసారి వైసీపీకి బిగ్ షాక్? ఆర్టీవీ స్టడీలో తేలిన ఊహించని లెక్కలివే!

విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2019లో ఇక్కడ వైసీపీ 11, టీడీపీ 4 సీట్లు గెలిచాయి. అంటే వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 2024లో ఈ జిల్లా ఓటర్లు టీడీపీ 9, వైసీపీ 2, జనసేన 3, బీజేపీకి 1 సీటు గెలిపించే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇందుకు సంబంధించిన నియోజకవర్గాల వారీగా లెక్కల వివరాలు ఇలా ఉన్నాయి.

భీమిలి..
ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు కూటమి బలం అడ్వాంటేజ్‌గా ఉంది. గతంలో ఇక్కడ గెలిచిన అనుభవం ప్లస్ అవుతోంది. భూకబ్జా ఆరోపణలు రావడం గంటాకు కొంత మైనస్ అవుతున్నా, ఆర్థిక బలం అదనంగా కలిసొచ్చే అంశం. హోరాహోరి పోటీ కనిపిస్తున్నా.. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

విశాఖపట్నం సౌత్..
ఉమ్మడి విశాఖ జిల్లాలో మరో కీలక సెగ్మెంట్ విశాఖపట్నం సౌత్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కు కుల సమీకరణలు ప్లస్ పాయింట్. మత్స్యకారుల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండడం ఆయనకు కలిసొస్తుంది. ప్రజలతో బాగా కలిసిపోతారన్న ఇమేజ్ ఉంది. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరడంతో ప్రచారంలో వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఓవరాల్‌గా విశాఖ సౌత్‌లో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌ విజయం సాధిస్తారని RTV స్టడీ చెబుతోంది.
publive-image

అనకాపల్లిలో..
ఇక అనకాపల్లికి వెళ్దాం. జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసొస్తుంది. అనకాపల్లి ప్రజలకు సన్నిహితుడుగా పేరుంది. గవర సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటం ప్లస్ అవుతోంది. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్‌కు రాజకీయ అనుభవం లేకపోవడం కూడా కొణతాలకు కలిసొచ్చే అంశమే. ఓవరాల్‌గా జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

ఇతర నియోజకవర్గాల్లో..
విశాఖపట్నం ఈస్ట్ లో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ, విశాఖ నార్త్ లో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, విశాఖ వెస్ట్- టీడీపీ అభ్యర్థి గణబాబు, గాజువాక-టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, చోడవరం-టీడీపీ అభ్యర్థి K.S.N రాజు, మాడుగుల-టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి అరకు-వైసీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం..

publive-image

పాడేరు-టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, పెందుర్తి-జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, యలమంచిలి-జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, పాయకరావుపేట-టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత, నర్సీపట్నం-టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీవీ సర్వేలో స్పష్టం అవుతోంది.
publive-image

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు