వ్యూహం సినిమాను అందుకే ఏపీ ఫైబర్ లో రిలీజ్ చేస్తున్నాం.!

వ్యూహం సినిమాని థియేటర్స్ తో పాటు ఒకేరోజు ఒకే సమయానికి ఏపీ ఫైబర్ నెట్ లో కూడా రిలీజ్ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. కేవలం రామ్ గోపాల్ వర్మ అడిగినందునే కార్పొరేషన్ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

New Update
వ్యూహం సినిమాను అందుకే ఏపీ ఫైబర్ లో రిలీజ్ చేస్తున్నాం.!

AP fibernet chairman goutham reddy: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాని థియేటర్స్ తో పాటు ఒకేరోజు ఒకే సమయానికి ఏపీ ఫైబర్ నెట్ లో కూడా రిలీజ్ చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వ్యూహం సినిమా ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన సినిమా కాబట్టే ఫైబర్ లో రిలీజ్ చేస్తున్నామనే దాంట్లో నిజం లేదని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ అడిగారు కాబట్టి కార్పొరేషన్ ద్వారా ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యూహం సినిమాలో అభ్యంతరాలు ఉంటే సెన్సార్ వాళ్ళు చూసుకుంటారే తప్ప నారా లోకేష్ లేఖలు రాయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అన్నారు. వ్యూహం సినిమాలో హీరో జగనా లేదా చంద్రబాబు అనేది సినిమా రిలీజ్ తర్వాత తెలుస్తుందని గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read: జగన్ మాట్లాడలేని దద్దమ్మ..రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు.!

కాగా, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జీవితం ఆధారంగా ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ వ్యూహం పేరుతో సినిమా తెర‌కెక్కించారు. వైఎస్సార్ మ‌ర‌ణానంత‌రం వైఎస్ జ‌గ‌న్‌ జైలు పాలు కావడం, తర్వాత జైలు నుండి బ‌య‌టికి రావ‌డం, సొంత పార్టీ పెట్టుకోవ‌డం, ఓదార్పు యాత్ర‌లు, 2014 ఎన్నిక‌ల్లో అడుగు దూరంలో అధికారానికి దూరం కావ‌డం, ఆ త‌ర్వాత పాద‌యాత్ర‌, అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డం, చంద్ర‌బాబు అరెస్ట్ త‌దిత‌ర అంశాల‌న్నింటిని వ్యూహం పార్ట్‌-1, 2ల‌లో తెర‌కెక్కంచనున్న‌ట్టు వ‌ర్మ వెల్ల‌డించారు.  ఇది రెండు పార్ట్‌లుగా ఆయ‌న తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై సినిమా విడుద‌ల చేయాల‌నేది వైసీపీతో పాటు ద‌ర్శ‌కుడు వ‌ర్మ ‘వ్యూహం’ గా క‌నిపిస్తోంది. ‘కుట్రలకు, ఆలోచనలకు మధ్య’ అని పేర్కొన‌డం ద్వారా రెండు సినిమాల క‌థ‌ల‌పై ఆస‌క్తిని రేకెత్తించారు. ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జ‌గ‌న్‌కు సానుకూల వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేయ‌డ‌మే ఫిల్మ్ మేక‌ర్స్‌గా ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది.

అయితే, నేడు రిలీజ్ కావాల్సి ఉన్న ఈ మూవీకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డు నిరాకరించింది. సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సినిమాకు పర్మిషన్‌పై రివైజింగ్‌ కమిటీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ, మలయాళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతీ పాత్రను మానస రామకృష్ణ అనే కొత్త నటి పోషిస్తున్నారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వ్యూహం సినిమా తీసినట్లు తెలుస్తోంది. అయితే, సినిమాల్ని ఎలా తెర‌కెక్కించి వుంటార‌నే ఆస‌క్తి నెల‌కుంది. ఈ సినిమాలు జ‌గ‌న్‌కు రానున్న ఎన్నిక‌ల్లో ఎంతోకొంత ప్ర‌యోజ‌నం క‌లిగిస్తాయా? లేదా? అనే అంశం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు