నిన్న విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌తో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అన్న ప్రశ్నకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రధాన పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. పలు సంస్థలు వైసీపీకి.. మరికొన్ని సంస్థలు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అందరిలో ఉత్కంఠ మరింతగా పెరిగిపోయింది. అయితే మెజార్టీ సంస్థలు కూటమికే పట్టం కట్టడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో ధీమా పెరిగింది. అయితే.. వైసీపీ నేతలు కూడా కొన్ని సంస్థలు చెప్పినట్లు అధికారం మాకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం తీవ్ర నిరాశే మిగిలింది. ఏ పార్టీ గెలుస్తుందో క్లారిటీ రాకపోవడంతో వారిలో టెన్షన్ పెరిగిపోయింది. దీంతో అందరి చూపు అసలు ఫలితాలపై పడింది. ఎల్లుండి జరిగే కౌంటింగ్ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.