David Sawang: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్‌లో రెండు గ్రూప్‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు ఉండటంతో ఇప్పుడు ఆ వార్త వైరల్‌గా మారుతోంది. ఏపీ మాజీ డీజీపీ, ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ కొడుకు హైదరాబాద్‌లో వీరంగం చేశాడని ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని జీరో పబ్ దగ్గర అర్థరాత్రి హంగామా జరిగింది. ఆ పబ్‌కు వెళ్లిన మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఫుల్లుగా మద్యం సేవించి గొడవ పడ్డారని చెబుతున్నారు.
అయితే, ఇదంతా ఓ యువతి విషయంలో జరిగిందని కూడా తెలుస్తోంది. ఓ అమ్మాయి విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. రాత్రి జీరో 40 పబ్ కి డేవిడ్ సవాంగ్, సిద్ధార్థ బ్యాచ్ వేర్వేరుగా పబ్ కి వెళ్ళారు. డేవిడ్ సవాంగ్ ప్రియురాలు ఇప్పుడు సిద్ధార్థ తో డేటింగ్ చేస్తోందని.. డేవిడ్ కి దూరంగా ఉంటోందని.. డేవిడ్, సిద్ధార్థ మధ్య ఇదే విషయంలో పలుమార్లు గొడవ జరిగిందని సమాచారం..అయితే రాత్రి పబ్ లో డేవిడ్, సిద్ధార్థ ఒకరినొకరు ఎదురుపడటంతో ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు.
కాసేపటి తరువాత పబ్ బయటకు వచ్చి మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగినట్లు తెలుస్తోంది. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్.. సిద్ధార్థ మాగ్నమ్ అనే యువకుడిపై దాడి చేశాడని అంటున్నారు. విచక్షణరహితంగా చితకబాదారట. పబ్ దగ్గర జరిగిన దాడుల గురించి సమాచారం అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో సిద్ధార్థకు తీవ్రగాయాలయ్యాయి. డేవిడ్ సవాంగ్‌కు కూడా గాయలు అయినట్టు పోలీసులు చెప్తున్నారు.
Also Read: కుటుంబాన్ని వదిలేసి వెళ్లిన మహిళ…పట్టించిన ఆధార్..!!