YS Jagan: మా ఓటమికి కారణం అదే.. నెల్లూరులో జగన్ సంచలన వ్యాఖ్యలు

తాము ప్రజల్లో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదన్నారు ఏపీ మాజీ సీఎం జగన్. చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా అధికారంలోకి వచ్చారన్నారు. దాడులకు పాల్పడే తప్పుడు సంప్రదాయాన్ని ఇకనైనా ఆపాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నామన్నారు.

YS Jagan: మా ఓటమికి కారణం అదే.. నెల్లూరులో జగన్ సంచలన వ్యాఖ్యలు
New Update

ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి పథకాలను అందించామన్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు నిలబడవన్నారు. తాము ప్రజల్లో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా అధికారంలోకి వచ్చారన్నారు. రైతు భరోసా కింద ఇస్తామన్న రూ.20 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అమ్మ ఒడి కింద ఇస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు రూ.1500 ఇస్తామని టీడీపీ చెప్పిందన్నారు. ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టాడని ధ్వజమెత్తారు. పాల్వాయిగేట్ పోలింగ్ గేట్ పోలింగ్ బూత్ లో అన్యాయం చూడలేకనే ఈవీఎంను పగులగొట్టాడన్నారు. ఆ ఘటన జరిగిన పది రోజుల తర్వాత అతనిపై హత్యాయత్నం కేసు పెట్టాడన్నారు. సిట్ రిపోర్ట్ లో ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ఫైర్ అయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిపై ఇలాంవటి తప్పుడు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలే చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.

రెడ్ బుక్ ల పేరుతో దారుణంగా, అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. దొంగ కేసులు పెడుతున్నారన్నారు. జేసీబీల మీద ఎమ్మెల్యేలే వెళ్తూ బిల్డింగ్ లను పడగొడుతున్నారన్నారు. ప్రజలు ఇలాంటివి క్షమించరన్నారు. చేతనైతే మంచి చేసి ప్రజల మనస్సులు గెలుచుకోవాలని సూచించారు. తప్పుడు సంప్రదాయాలను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని చంద్రబాబును హెచ్చరిస్తున్నామన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe