YS Jagan: నంద్యాలలో హత్యకు కారణం అదే.. జగన్ సంచలన ట్వీట్

హామీలు నిలబెట్టుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎవరూ రోడ్లపైకి రాకుండా భయభ్రాంతులకు గురి చేసేందుకు దుర్మార్గాలకు పాల్పడుతోందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల అండతోనే నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి హత్య జరిగిందని ఆరోపించారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటామన్నారు.

New Update
YS Jagan: నంద్యాలలో హత్యకు కారణం అదే.. జగన్ సంచలన ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందని ఆరోపించారు. రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదన్నారు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయన్నారు.

నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోతున్నాడన్నారు. దీంతో ఎవరూ ప్రశ్నించకూడదని ప్రజలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. రోడ్డుపైకి రాకుండా ప్రజలలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.

ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లా మహానంది మండలం సీతారామపురంలో దారుణ హత్య జరిగింది. వైసీపీ నేత సుబ్బారాయుడును దుండగులు రాళ్లతో కొట్టి, నరికి చంపారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలే చంపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా పని చేయడంతోనే సుబ్బారాయుడిని హత్య చేశారని కుటుంబ సబ్యులు చెబుతున్నారు. మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి అనుచరుడు.


Advertisment
Advertisment
తాజా కథనాలు