చంద్రబాబును చదువుకునే రోజుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టాడని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి, చంద్రబాబు మధ్య పంచాయితీ ఈ రోజుది కాదన్నారు. వారిద్దరు కాజేజీ రోజుల్లో క్లాస్ మెట్స్ అని అన్నారు. ఆ సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబును కొట్టాడన్నారు. ఆ కోపాన్ని చంద్రబాబు ఇప్పటికీ కొనసాగిస్తున్నాడన్నారు. దీంతో పెద్దిరెడ్డి ఏ శాఖ నిర్వహించినా చంద్రబాబు అందులో తప్పుడు ఆరోపణలు చేస్తాడన్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: హైకోర్టులో జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
పెద్దిరెడ్డి అంటే చంద్రబాబుకు పీకల్లోతు కోపం అని అన్నారు. ఎప్పుడు చూడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని తొక్కేయాలని చంద్రబాబు ఆలోచిస్తాడన్నారు. పెద్దిరెడ్డిని నాశనం చేయాలనే చంద్రబాబు చూస్తాడన్నారు. పెద్దిరెడ్డి 7సార్లు ఎమ్మెల్యే, మిథున్‌రెడ్డి 3సార్లు ఎంపీగా విజయం సాధించారని వివరించారు. జనాల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి మంచి పేరుందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అబాసుపాలు చేయడమే చంద్రబాబు టార్గెట్ అని ధ్వజమెత్తారు జగన్.
ఇది కూడా చదవండి: YS Jagan: అసెంబ్లీకి నో.. జగన్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?