YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన.. ఢిల్లీలో ఏం చేస్తామంటే?: జగన్ సంచలనం ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరంపై ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి వివరిస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలనను ఈ నెల 24న ఢిల్లీలో ఫొటో గ్యాలరీ ద్వారా దేశానికి వివరిస్తామన్నారు. ఈ మేరకు జగన్ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. By Nikhil 22 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన కేవలం 50 రోజుల్లోనే చంద్రబాబు ప్రభుత్వం (TDP Govt) అన్నింటా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఫైర్ అయ్యారు. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోందన్నారు. అందుకే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోందని వివర్శించారు. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ మీదే నడుస్తోందని నిప్పులు చెరిగారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుందన్న భయం ప్రభుత్వానికి ఉందన్నారు. Also Read: శాంతి ఉద్యోగం ఊస్ట్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు! ప్రజల దృష్టిని మళ్లించి రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉందన్నారు. కాబట్టి, ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పాపాలు కూడా పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జగన్. తనతో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి… — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2024 ఈ నెల 24న ఢిల్లీలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్యా రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీపై ఫోటో గ్యాలరీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్కడ ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీ నాయకుల దృష్టికి ఇక్కడి పరిస్థితులను తీసుకెళ్తామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరాన్ని, పరిస్థితులను చెప్పబోతున్నామన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ మేరకు జగన్ తన X ఖాతాలో పోస్టు చేశారు. Also Read: మదనపల్లె అగ్నిప్రమాద ఘటన.. వారిపైనే అనుమానం: మంత్రి అనగాని #tdp #chandrababu-naidu #tcp #ys-jagan #ap-politics మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి