Chandrababu IRR Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (IRR Case) చంద్రబాబుకు (Chandrababu) హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో వచ్చే సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది. అంగళ్లు కేసులో రేపటికి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్ఆర్ పీటీ వారెంట్ పై సోమవారం వరకు స్టే ఇచ్చింది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పీటీ వారెంట్, కస్డడీపై సోమవారం వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా అంగళ్లు కేసులో రేపటి వరకు పీటీ వారెంట్ వేయబోమని ప్రభుత్వ తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు. రేపు హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగనుంది.
ఇది కూడా చదవండి: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?
ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై లంచ్ బ్రేక్ తర్వాత ఈ రోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందదని హైకోర్టుకు తెలిపారు.
ఈ స్టేజ్ లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మలపాటి శ్రీధర్ వాదనలు వినిపిస్తూ.. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు.