Big Breaking: ముగిసిన చంద్రబాబు తొలిరోజు విచారణ.. చంద్రబాబును ఏం ప్రశ్నలు అడిగారంటే?

స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని ఈ రోజు సీఐడీ విచారించింది. సాయంత్రం 5 గంటలకు ఆయన తొలి రోజు విచారణ ముగియగా.. మొత్తం 60 ప్రశ్నలను సీఐడీ సంధించినట్లు సమాచారం.

New Update
Big Breaking: ముగిసిన చంద్రబాబు తొలిరోజు విచారణ.. చంద్రబాబును ఏం ప్రశ్నలు అడిగారంటే?

స్కిల్ డవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును (AP CM Chandrababu) రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ ఈ రోజు ఆయనను విచారించింది. ఉదయం పది గంటల నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ సాగింది. 12 మంది సిఐడి అధికారుల బృందం చంద్రబాబును విడతల వారీగా విచారించింది. ఒక సీఐడీ డీఎస్పీ ఇద్దరు సిఐలతో కలిసి మూడు మూడు గ్రూపులుగా విచారణ చేశారు. ఈ రోజు సీఐడీ సుమారు 60 ప్రశ్నలను చంద్రబాబును అడిగినట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనేక కీలక ఫైళ్లను చంద్రబాబు ముందు ఉంచి చంద్రబాబును ప్రశ్నించినట్లు సమాచారం.

సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి, డిజన్ టెక్ కు సంబంధించిన వివరాలు, అదే విధంగా షెల్ కంపెనీల కు సంబంధించిన లావాదేవీల పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలారి రాజేష్,చంద్రబాబు పి.ఎ,శ్రీనివాస్, నారా లోకేష్ కు సంబంధించి వివరాల సేకరణే లక్ష్యంగా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురింపించారని తెలుస్తోంది. రాజమండ్రిలో జరుగుతున్న పరిస్థితులను నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు.

చంద్రబాబు చెప్పిన సమాధానాలను సీఐడీ అధికారులు రికార్డు చేశారు. విచారణ అనంతరం మరో సారి చంద్రబాబుకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. చంద్రబాబు విచారణ రేపు కూడా కొనసాగనుంది. ఒక వేళ చంద్రబాబు చెప్పిన సమాధానాలతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందకపోతే మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరో వైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన తరఫు లాయర్లు సుప్రింకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:

Navdeep: ముగిసిన నవదీప్ విచారణ.. మళ్లీ పిలుస్తామన్న పోలీసులు

Advertisment
తాజా కథనాలు