AP Game Changer: శ్రీకాకుళం జిల్లాలో ఈ సారి సీన్ రివర్స్.. RTV స్టడీలో తేలిన సంచలన లెక్కలివే!

ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా వైసీపీకి షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ జిల్లాలో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అన్న అంశంపై ఆర్టీవీ స్టడీ తేల్చిన లెక్కలు ఇలా ఉన్నాయి.

AP Game Changer: శ్రీకాకుళం జిల్లాలో ఈ సారి సీన్ రివర్స్.. RTV స్టడీలో తేలిన సంచలన లెక్కలివే!
New Update

మొత్తం 10 సీట్లు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిక్యత సాధించింది. ఆ పార్టీ ఎనిమిది సీట్లు సాధిస్తే, టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. వైసీపీ నేతలు ధర్మాన సోదరులు, తమ్మినేని సీతారాం ఈ జిల్లా నుంచే గెలిచారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ జిల్లా నుంచే విజయం సాధించారు. ఈసారి శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా ఉండే అవకాశం ఉంది.

టెక్కలి:
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గం టెక్కలి. అచ్చెన్నాయుడు వరుసగా రెండు సార్లు గెలిచిన సీట్‌ ఇది. వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ సామాజికవర్గమైన కాళింగ ఓటర్లు అత్యధికంగా ఉన్నా ఆయనకు పూర్తి స్థాయిలో వారి మద్దతు కనిపించడం లేదు. కాళింగ ఓటర్లలో 50 శాతం మంది టీడీపీ వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడంతో వైసీపీ ఓట్లకు గండిపడేలా ఉంది. ఎందుకంటే ఆమె మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు. మొత్తానికి టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మూడోసారి గెలవబోతున్నారని RTV స్టడీలో తేలింది.
publive-image

పాతపట్నంలో..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు వైసీపీకి ప్లస్‌గా మారాయి. మొన్నటి వరకు టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న కలమట వెంకటరమణకు టిక్కెట్‌ దక్కలేదు. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి మామిడి గోవింద్‌కు వెంకటరమణ వర్గం గ్రౌండ్‌లో సహకరించడం లేదు. అయితే గోవింద్‌కు ఎంపీ రామ్మోహన్‌ నాయుడు మద్దతు ఉంది. అధిష్టానం ఆదేశంతో గోవింద్‌తో వెంకట రమణ చేయి కలిపినా... కేడర్‌ మాత్రం ఎలక్షనీరింగ్‌కు దూరంగానే ఉంది. అదే వైసీపీకి అనుకూల అంశం. రెడ్డి శాంతి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉండటంతో ఆమె గెలుపు కోసం కేడర్‌ ఒక్కటై పని చేస్తోంది. దాంతో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి విజయం సాధించే అవకాశం అధికంగా ఉన్నట్లు RTV స్టడీలో తేలింది.
publive-image

ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా..
ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, పలాస-టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష, పాతపట్నం-వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి, శ్రీకాకుళం-వైసీపీ అభ్యర్థి గుండు శంకర్, ఎచ్చెర్ల-వైసీపీ అభ్యర్థి గెర్లె కిరణ్ కుమార్..
publive-image

నరసన్నపేట-టీడీపీ అభ్యర్థి భగ్గు రమణ మూర్తి, రాజాం-టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళి, పాలకొండ వైసీపీ అభ్యర్థి విశ్వసరాయి కళావతి గెలిచే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.
publive-image

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe