TDP Manifesto 2024: ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పాడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్దార్థ్ సింగ్ కూటమి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. టీడీపీ సూపర్ సిక్స్ తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం సూత్రాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు అధినేతలు తెలిపారు.
కూటమి మేనిఫెస్టో హామీలు ఇవే ...
1. మెగా డీఎస్సీపై తొలి సంతకం
2. వృద్ధాప్య పెన్షన్ రూ.4000
3. దివ్యాంగుల పెన్షన్ రూ.6000
4.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500
5. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం
6. యువతకు 20 లక్షల ఉద్యోగాలు
7. రూ. 3000 నిరుద్యోగ భృతి
8. తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి రూ.15000
9. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ
10. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి
11. వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10,000
12. ఉచిత ఇసుక
13. అన్నా క్యాంటీన్లు
14. భూ హక్కు చట్టం రద్దు
15. ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్
16. బీసీ రక్షణ చట్టం
17. పూర్ టూ రిచ్ పథకం
18. చేనేతకు 200 యూనిట్లు, మరమగ్గాలుంటే 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీ
19. కరెంటు చార్జీలు పెంచం
20. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్
21. పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం
22. పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం
23. పెళ్లి కానుక రూ.1,00,000/-
24. విదేశీ విద్య పథకం
25. పండుగ కానుకలు
Also Read: పవన్ కోసం రంగంలోకి దిగిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ టీం..!
జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా
* ఇంటింటికీ రక్షిత మంచినీరు
* స్కిల్ సెన్సస్, నైపుణ్య గణన
* స్టార్టప్ సంస్థలకు రూ. 10 లక్షల ఆర్థిక ప్రోత్సాహకం
* EWS రిజర్వేషన్లు
* ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి.