Kadapa: కడప జిల్లాలో డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు, నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని.. కౌంటింగ్ కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలని హెచ్చరించారు.
144 సెక్షన్..
ఆర్టీసి బస్సులను నగర శివారులో నడపడం జరుగుతుందన్నారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో షాపులు మొత్తం బంద్ చేయండం జరుగుతుందని..ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. ఇతర జిల్లాల నుంచి ఎవరు రాకూడదని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ పరిమిషన్ లేకుండా ఇతర వ్యక్తులు రాకూడదన్నారు. నగర శివారులో 7 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని సీసీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
Also Read: విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులు.. నర్సింగ్ సూపరిండెంట్ సంచలన వ్యాఖ్యలు..!
రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే..
స్ట్రాంగ్ రూమ్ బయట నాలుగు అంచాల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలను పోలీసుల పరిమిషన్ లేకుండా ఎవరికి ఇవ్వకూడదన్నారు. జిల్లా అధికారుల సూచనల మేరకు మద్యం షాపులకు సడలింపులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
ప్రజలు సహకరించాలి..
పద్మవ్యూహం లాంటి టింను ఏర్పాటు చేయడం జరుగుతుందని.. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. ఎవరైనా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జూన్ 3వ తేది పార్టీ కార్యాలయాలు బంద్ చేసి సీసీ కెమరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కడప సబ్ డివిజన్ ఎటువంటి ర్యాలీలు, అల్లర్లకు పాల్పడకూడదని, నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. కడప సబ్ డివిజన్ లో ముగ్గురు మీద రౌడి షీటర్లు నమోదు చేయడం జరిగిందన్నారు.