IAS Transfers In AP: ఏపీలో ఎన్నికలు.. ఈసీ షాకింగ్ డెసిషన్!

మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు ఉన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉన్నత అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ బదిలీ వేటులో ముగ్గురు ఐఏఎస్ అధికారుల, ఐదుగురు ఎస్పీలు, ఒక ఐజీ ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది

New Update
IAS Transfers In AP: ఏపీలో ఎన్నికలు..  ఈసీ షాకింగ్ డెసిషన్!

IAS Transfers In AP: ఏపీలో ఎన్నికల వేళ ఈసీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. పలువురు ఉన్నతాధికారులపై వేటు వేసింది. వేటు పడిన వారిలో ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐజీ, ఐదుగురు ఎస్పీలు ఉన్నారు. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి పంపాలని స్టేట్ సీఈవోకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.

బదిలీ అయిన వారు..

* చిత్తూరు ఎస్పీ జాషువా బదిలీ
* పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి బదిలీ వేటు
* ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్
* అనంతపురం ఎస్పీ అన్బురాజన్
* నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్
* గుంటూరు రేంజ్ ఐజీ పాల్‌రాజు
* కృష్ణా జిల్లా కలెక్టర్‌ రాజబాబు
* అనంతపురం కలెక్టర్ గౌతమి
* తిరుపతి కలెక్టర్ లక్ష్మిషా

Advertisment