AP TET, DSC: ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షపై ఈసీ కీలక నిర్ణయం

ఊహించినట్లుగానే ఏపీలో డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని నిర్వహించవద్దని, టెట్ ఫలితాలను విడుదల చేయవద్దని ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

AP TET 2024: టెట్ సిలబస్ ఇదే.. ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన!
New Update

ఏపీలో డీఎస్సీ (AP DSC) పరీక్ష నిర్వహణ, టెట్ (AP TET) ఫలితాల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీ నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా టెట్ ఫలితాలను కూడా విడుదల చేయవద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఏపీలో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షపై కొన్ని రోజులుగా నిరుద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఈ రోజు.. అంటే 30వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. టెట్ పరీక్ష ఫలితాలు కూడా ఈ నెల 14వ తేదీనే విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు విడుదల చేయలేదు. ఈసీ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆదేశాలతో ఎన్నికల తర్వాతనే టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. కోడ్ ముగిసిన తర్వాత విద్యాశాఖ అధికారులు డీఎస్సీ కొత్త తేదీలను విడుదల చేయనున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe