Jagan Defeat: జగన్ ను ముంచిన 'మూడు రాజధానులు'

రాష్ట్రానికి మూడు రాజధానులు చేస్తామంటూ ప్రకటనలు చేసిన వైసీపీని అదే అంశం ముంచినట్లు ప్రస్తుత ఎన్నికల ఫలితాలను విశ్లేస్తే అర్థం అవుతోంది. ఏపీని రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటూ ప్రతిపక్షాలకు చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లినట్లు అర్థం అవుతోంది.

New Update
Jagan: 'జగన్ బాయ్ బాయ్'.. మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం..!

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఏడాది తర్వాత 'అధికార వికేంద్రీకరణ' అంటూ మూడు రాజధానులు చేస్తున్నామని ప్రకటించింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. జగన్ విశాఖ నుంచే ఇక పరిపాలన సాగిస్తారంటూ ఎప్పటికప్పుడూ ప్రకటిస్తూ వచ్చారు వైసీపీ నేతలు. కానీ, ఎన్నికలు వచ్చే నాటికి కూడా అమరావతి నుంచే జగన్ పాలన సాగింది.

ఈ అంశాన్ని కూటమి నేతలు అస్త్రంగా చేర్చుకున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని ధ్వజమెత్తారు. ఈ అంశం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఏపీకి హైదరాబాద్ స్థాయి రాజధాని కావాలంటే చంద్రబాబే మళ్లీ సీఎం కావాలన్న విషయాన్ని బాగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రాకపోతే యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటూ ప్రచారం చేశారు. ఈ విషయం బాగా ప్రజల్లోకి వెళ్లింది. సంక్షేమ పథకాలే మమ్ముల్ని గెలిపిస్తాయంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీకి చావుదెబ్బ కొట్టిన అంశాల్లో రాజధాని ప్రధానంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు