/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Tadipathri-.jpg)
అనంతపురం జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. తాడిపత్రిపై ఈసీ ప్రత్యేక నిఘా ఉంచింది. పోలింగ్ రోజు రణరంగంగా తాడిపత్రి మారిన సంగతి తెలిసిందే. జేసీ ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డి వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. దీంతో మళ్లీ అలాంటి పరిస్థితి తలెత్తకుండా పోలీసుల జాగ్రత్తలు చేపట్టారు. ఇరు వర్గాలకు చెందిన పలువురి నేతలను బైండోవర్ చేశారు. రెచ్చగొట్టినా, హింసకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.