జగన్ సర్కార్ కు ఈసీ షాక్.. వాలంటీర్లు ఔట్! వాలంటీర్లను విధుల నుంచి తప్పించాలంటూ వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికలు ముగిసే వరకు వారిని విధుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. వారికి అందించిన ఫోన్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. By Nikhil 30 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వారికి ప్రభుత్వం అందించిన ఫోన్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. అవసరం అయితే సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందాయి. ఏపీలో వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి గతంలోనే తప్పించింది ఈసీ. తాజాగా సంక్షేమ పథకాల డబ్బులను సైతం వారి ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. అయితే.. వివిధ పార్టీల నుంచి ఫిర్యాదులు అందడంతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి