/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Vanga-Geetha-1.jpg)
YCP MLA Candidate Vanga Geetha: ఏపీలో ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం ఉన్న క్రమంలో పిఠాపురంలో వంగా గీతకు బిగ్ షాక్ తగిలింది. వంగా గీత ఆఫీసును ఓటర్లు ముట్టడించారు. కొందరికి డబ్బులిచ్చి తమకు ఇవ్వడం లేదని ఆందోళనలు చేశారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టారు పోలీసులు. యు. కొత్తపల్లి మండలం కొండవరంలోనూ ఆందోళన చేస్తున్నారు. తమకే ఓటేస్తామని ప్రమాణం చేస్తేనే డబ్బులిస్తామని వైసీపీ నేతలు చెప్పారంటూ రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రమాణం చేయమని స్థానికులు తేల్చి చెప్పారు. అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని తమకు పంచడం లేదని ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.