కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడుతూ.. నిన్న ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో అన్న జగన్ తనపై అభ్యంతరకర వాఖ్యలు చేశారు. ఈ వ్యాఖలు అసత్యాలంటూ భావొద్వేగానికి లోనై కంట తడి పెట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారు తనను తప్పుగా భావించకూడదన్నారు. షర్మిలకు రాజకీయ కాంక్ష ఉందని జగన్ ఆరోపించారనన్నారు. తమ మధ్య తేడాలు రావడానికి ఇవే కారణాలు అని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందెవరని ప్రశ్నించారు.
చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుందని తనను పాదయాత్ర చెయ్యమన్నది నువ్వు కాదా? అని జగన్ ను ప్రశ్నించారు. తనకు రాజకీయ కాంక్ష ఉంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని హై జాక్ చేసే దాన్ని కాదా? అని ప్రశ్నించారు. అమ్మకు తనను ఎంపీని చేస్తానని జగన్ మాట ఇచ్చారన్నారు. అదే అమ్మ అడుగుతున్నా సమాధానం లేదన్నారు. తాను పదవి అడిగినట్లు బైబిల్ మీద ఒట్టేసి చెప్పగలరా? అని ప్రశ్నించారు. రాజకీయ కాంక్ష కోసమే తాను దెబ్బతీసానని చెప్పడానికి మనసు ఎలా వచ్చిందని ప్రశ్నించారు?
పైసా సాయం చేయమని జగన్ ను ఏనాడూ అడగలేదన్నారు. డబ్బు ఆశ ఉంటే నాన్న ఉన్నపుడే సంపాదించుకునే దాన్ని అని అన్నారు. జగన్ కు చంద్రబాబు పిచ్చి పట్టిందని.. ఆయన మెంటల్ స్టేటస్ సరిగాలేదన్నారు. వివేకా హత్య కేసు విషయంలో అవినాష్ ప్రమేయం లేదని కన్విన్స్ అవడానికి నువ్వెవరు? అని జగన్ ను ప్రశ్నించారు. కర్నూల్ లో సీబీఐ ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు.