AP Elections 2024: ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి బరిలోకి దిగేది వీళ్లే..!

మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కు రానున్న ఎన్నికల్లో టికెట్ ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆయన కూడా మరోసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.

AP Elections 2024: ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నుంచి బరిలోకి దిగేది వీళ్లే..!
New Update

Vishaka YCP MLA Candidates List:  ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections 2024) పోటీ చేయబోతున్న 175 మంది అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధినేత, సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కు టికెట్ ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఆయన కూడా మరోసారి ఎన్నికల బరిలో దిగనున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎవరెవరు ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం..

Also Read: వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ఇదే.. ఎవరెవరున్నారంటే?

విశాఖ జిల్లా వైసీపీ అభ్యర్ధులు

పెందుర్తి – అదీప్ రాజ్- బీసీ

యలమంచిలి – ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు (కన్నబాబు రాజు)- ఓసీ

నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేశ్ - బీసీ

చోడవరం – ధర్మశ్రీ కరణం - బీసీ

మాడుగుల – బూడి ముత్యాల నాయుడు- బీసీ

పాయకరావుపేట(ఎస్సీ) – కంబాల జోగులు- ఎస్సీ

పాడేరు(ఎస్టీ) – మత్స్యరాస విశ్వేశ్వర రాజు - ఎస్టీ

అరకు లోయ(ఎస్టీ) – రేగం మత్స్యలింగం- ఎస్టీ

విశాఖ ఈస్ట్ – ఎంవీవీ సత్యనారాయణ- ఓసీ

విశాఖ వెస్ట్ – ఆడారి ఆనంద్ - బీసీ

విశాఖ సౌత్ – వాసుపల్లి గణేశ్ - బీసీ

విశాఖ నార్త్ – కేకే రాజు - ఓసీ

గాజువాక – గుడివాడ అమర్‌నాథ్ - ఓసీ

భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్) - ఓసీ

అనకాపల్లి – మలసాల భరత్ కుమార్- బీసీ

#ap-minister-gudivada-amarnath #ap-elections-2024 #ycp-mla-list
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe