AP Elections 2024:  దెందులూరులో ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ

ఏపీలో ఎన్నికల వేళ ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత. అక్కడ టీడీపీ ప్రలోభాలకు పాలుపడుతోందంటూ వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. బూత్ నెంబర్ 64 దగ్గర పసుపు కండువాతో వచ్చి డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

New Update
AP Elections 2024: పోలింగ్ కు ముందు ఏపీలో గందరగోళం 

AP Elections 2024: పోలింగ్ వేళ ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్ నెంబర్ 64 దగ్గర టీడీపీ, వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బులు పంచుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలో పసుపు రంగు కండువాతో వచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఫైటింగ్ కు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

శ్రీకాకుళం జిల్లాలో.. 

AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా కిష్టప్పపేట పోలింగ్‌ బూత్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. వైసిపీ ఏజెంట్ గా వాలంటీర్ అక్కడకు రావడంతో టీడీపీ ఏజెంట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ కు తమ అభ్యంతరాన్ని తెలియచేశారు. అయితే, ఆయన వాలంటీర్ ఏజెంట్ గా ఉండవచ్చని చెప్పారు. ఈలోపు వైసీపీ నేత ధర్మాన ప్రసాద్ అక్కడి ఆర్వోకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఏజెంట్లు ఎలక్షన్ ఆఫీసర్ తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అయినా సరే.. ఆయన వాలంటీర్ ఏజెంట్ గా ఉండొచ్చని చెప్పడంతో టీడీపీ అభ్యర్థి ఈ విషయాన్ని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 

కడప జిల్లాలో.. 

AP Elections 2024: కడప జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. మాజీఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామం కోగటంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఇంటి ముందు వాహనం నిలిపారని.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోగటంలో పోలీసు బలగాలు మోహరించాయి. పోలింగ్‌ వేళ టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆందోళనలో ప్రజలు. 

కాకినాడలో మొరాయించిన ఈవీఎం.. 

AP Elections 2024: కాకినాడ జిల్లా జగ్గంపేటలో EVM మొరాయించింది. ఈ ఘటన జగ్గంపేట జూనియర్ కాలేజ్ 158వ బూత్‌లో జరిగింది. EVMలు మొరాయించడంతో ఓటర్ల ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ మొదలై గంట దాటుతున్నా ఇప్పటికీ EVMలు అందుబాటులోకి రాకపోవడంతో క్యూ లైన్‌లో నిల్చోలేక వృద్ధులు ఇంటిబాట పట్టారు. 

Advertisment
తాజా కథనాలు