AP Elections 2024: కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. జగన్ స్కెచ్ ఇదే! టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు సమాచారం. వైసీపీలో చేరాలని డిసైడ్ అయిన కేఈ.. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీగా కేఈ ప్రభాకర్ ను బరిలోకి దించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. By Nikhil 09 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి ఎన్నికలు (AP Elections 2024) దగ్గర పడుతున్న వేళ కర్నూలు జిల్లాలో టీడీపీకి (TDP) బిగ్ షాక్ తగలనుంది. పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ఆ పార్టీకి ఝలక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ మారేందుకు ఆయన సిద్ధమైనట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు కేఈ ప్రభాకర్ (KE Prabhakar) ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. వైసీపీ అధిష్టానంతో కేఈ ప్రభాకర్ టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేపు లేదా ఎల్లుండి ప్రభాకర్ తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: Janasena: జనసేనకు బిగ్ షాక్.. పార్టీ సమన్వయకర్త రాజీనామా..! కేఈతో పాటు మరికొందరు కూడా వైసీపీలోకి జాయిన్ అవుతారన్న ప్రచారం సాగుతోంది. అయితే ప్రభాకర్ కు కర్నూల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్యను వైసీపీ ప్రకటించింది. అయితే.. ఆయనను తప్పించి ఆ స్థానంలో కేఈ ప్రభాకర్ ను బరిలోకి దించాలనన్నది వైసీపీ అధినేత జగన్ ప్లాన్ గా తెలుస్తోంది. #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి