Gandi Babji: టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి టీడీపీకి రాజీనామా చేశారు. తాజాగా ప్రకటించిన సెకండ్ లిస్టులో తనకు పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించిన బాబ్జి.. టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Gandi Babji: టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Gandi Babji Resigns TDP: ఏపీలో రానున్న రెండు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేద్దాం అని వ్యూహాలు రచిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు విశాఖలో బిగ్ షాక్ తగిలింది. విశాఖ టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇంఛార్జి గండి బాబ్జి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు (Chandrababu) పంపించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సెకండ్ లిస్టులో తనకు పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని భావించిన బాబ్జి.. టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు (Janasena) పెందుర్తి టికెట్ కేటాయించారు చంద్రబాబు. విశాఖ సౌత్‌ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్‌ ను ప్రకటించారు. పెందుర్తి అభ్యర్థిగా పంచకర్ల పంచకర్ల రమేష్‌ బాబు కు టికెట్ దక్కింది. కనీసం మాడుగల టికెట్‌ అయినా వస్తుందని ఆశించిన గండి బాబ్జీ కి చివరికి నిరాశే మిగిలింది. మాడుగుల టికెట్‌ను NRI పైల ప్రసాద్‌కు టీడీపీ హైకమాండ్‌ కేటాయించింది. టికెట్‌ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో గండి బాబ్జీ.. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.

ALSO READ: పవన్ కళ్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే!

చంద్రబాబు మోసం చేశారు..

టీడీపీకి రాజీనామా చేసిన గండి బాబ్జీ చంద్రబాబు విమర్శలకు దిగారు. తనకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు చివరికి మోసం చేశారని మండిపడ్డారు. తనకు టికెట్ కేటాయిచకుండా.. మభ్యపెట్టేందుకు పార్టీ ఏదో ఒక చోట అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఇలాంటి మోసపూరిత విధానంతో పార్టీలో ఉండలేను అని అన్నారు. తాను ఏదో పార్టీ నుండి.. పెందుర్తి నుండి పోటీ చేయనున్నట్లు తేల్చి చెప్పారు. త్వరలోనే తన తదుపరి కార్యాచరణ చెప్తానని అన్నారు. గండి బాబ్జీ ఏ పార్టీలో చేరతారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

34 మందితో రెండో జాబితా..

34 మందితో టీడీపీ సెకండ్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే.. 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. తాజాగా.. రెండో జాబితాను విడుదలచేశారు. చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. పూర్తి లిస్ట్ కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు