Slipper On CM : సీఎం జగన్‌పైకి చెప్పు... ఎవరి పని?

అనంతపురం జిల్లా గుత్తిలో కలకలం రేగింది. సీఎం జగన్‌పై దుండగుడు చెప్పు విసిరాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు నాయకులు. అటు చెప్పు విసిరిన దండగుడి కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.

New Update
Slipper On CM : సీఎం జగన్‌పైకి చెప్పు... ఎవరి పని?

Memantha Siddam : సీఎం జగన్‌(CM Jagan) పై దాడికి యత్నించాడు ఓ దండగుడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జరిగిన ఈ ఘటనతో అక్కడి పోలీసులు, వైసీపీ(YCP) పెద్దలు ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లా(Anantapur District) గుత్తిలో జగన్‌ బస్సు యాత్ర(Jagan Bus Yatra) చేస్తుండగా దుండగుడు సీఎం టార్గెట్‌గా చెప్పు(Slipper On CM) విసిరాడు. అయితే జగన్‌కు ఆ చెప్పు తగలలేదు. వేరే చోట పడిపోయింది. జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు వైసీపీ నేతలు. అటు పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. చెప్పు విసిరిన దండగుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

Also Read : నారా లోకేశ్ కు జడ్ కేటగిరి కల్పించిన కేంద్రం

ఇక జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోండగా.. మరోవైపు రేపు(మార్చి 31) ఈస్టర్ సందర్భంగా బస్సుయాత్రకు జగన్ బ్రేక్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 1నుంచి బస్సు యాత్ర తిరిగి స్టార్ట్ అవుతుంది.

Advertisment
తాజా కథనాలు