కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల (YS Sharmila) చేరిక ఖాయమని తెలుస్తోంది. అయితే.. ఏపీసీసీ (APPCC) అధ్యక్ష పదవిపై ఆమె ఆసక్తి చూపడం లేదని.. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని షర్మిల కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ మేరకు ఆమె రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy Press Meet: కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేస్తున్నాం-కిషన్ రెడ్డి
వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు షర్మిల పార్టీ నేతలకు తెలియజేశారు. అయితే.. షర్మిలతో పాటు వైసీపీకి చెందిన 10 మందికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరిక నేపథ్యంలో ఆయన సోదరుడు ఏపీ సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు ఎలా స్పందిస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు ఏపీలో అన్నపై పోరాటం చేయాల్సిన అవసరం ఇంత వరకూ ఏర్పడలేదు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో చేరి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకం కావడం దాదాపు కన్ఫామ్ కావడంతో అన్నపై ఆమె పోరాటం ఎలా ఉండబోతుంది? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.