ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోని మొత్తం 10 సీట్లను వైసీపీ స్వీప్ చేసింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. మరి 2024లో నెల్లూరు జిల్లా ఫలితాలు నియోజకవర్గాల వారీగా ఇలా ఉండే అవకాశం ఉంది.
కోవూరు:
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర చర్చకు కేంద్రంగా ఉన్న సెగ్మెంట్ కోవూరు. టీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సొంత నిధులతో చేస్తున్న పలు సేవాకార్యక్రమాలు అమెకు ప్లస్ అవుతున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరులని టీడీపీలో చేర్చుకోవడంలోనూ ఆమె సక్సెస్ అయ్యారు. మొత్తంగా వేమిరెడ్డి గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.
నెల్లూరు రూరల్:
ఇక నెల్లూరు రూరల్‌లో టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి... వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ పాయింట్. ప్రజాసమస్యలపై పోరాడతారన్న పేరు ఆయనకి కలిసొస్తుంది. అటు వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి రాజకీయ అనుభవం కలిసొచ్చే అంశం. అయితే టఫ్‌ఫైట్ కనిపిస్తున్నా కోటంరెడ్డి గెలుస్తారని RTV స్టడీలో తేలింది.
సర్వేపల్లి:
ఇక సర్వేపల్లిలో పరిస్థితి చూస్తే.. మంత్రిగా ఉండడం స్థానికంగా పట్టు సంపాధించడం వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్లస్ పాయింట్. గ్రామాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండడం ఆయనకు అడ్వాంటేజ్. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వరుసగా ఓడిపోవడంతో ఆయనపై సానుభూతి ఉంది. అయితే ఆ సానుభూతి ఓట్లుగా రాలే అవకాశం కనిపించడం లేదు. మొత్తంగా కాకాణి మరోసారి గెలిచే అవకాశం ఉందని మా స్టడీ చెప్తోంది.
ఇతర నియోజకవర్గాలు..
కావలిలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి, ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, గూడూరులో వైసీపీ అభ్యర్థి మెరిగ మురళీధర్ సూళ్లూరుపేటలో వైసీపీ అభ్యర్థి కలివేటి సంజీవయ్య, వెంకటగిరిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.