/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/tirupathi-jpg.webp)
తిరుపతి లోక్ సభ స్థానం విషయానికి వస్తే... వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావడం ఆయనకు కలిసొస్తుంది. తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారన్న ఇమేజ్ ఉంది. పులికాట్ సరస్సు పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నారన్న టాక్ ఉంది.
అయితే ఆర్థికంగా వీక్ బలంగా లేకపోవడం గురుమూర్తికి మైనస్ అవుతుంది. ఇక బీజేపీ అభ్యర్ధి వరప్రసాద్‌కు కూటమి బలం కలిసొస్తుంది.ఈయన గతంలో ఎంపీగా పనిచేసినా, తిరుపతి అభివృధ్ధికి ఏమీ చేయలేదన్న టాక్ ఉంది. ఎంపీ ఫండ్స్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణ వరప్రసాద్‌కు ఇబ్బంది.
తిరుపతి లోక్‌సభ పరిధిలోని సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని మా స్టడీలో ఇప్పటికే చెప్పాం. వెంకటగిరి, శ్రీకాళహస్తిలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది. ఓవరాల్‌గా వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి మరోసారి ఎంపీగా గెలుస్తారని RTV స్టడీలో తేలింది.