ఈ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ మరోసారి ఆధిక్యత చాటే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇక్కడ వైసీపీకి 6, టీడీపీకి 3 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
చీపురుపల్లి:
విజయనగరం జిల్లాలో కీలక నియోజకవర్గం చీపురుపల్లి. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభావం ఎక్కువగా ఉన్న సీట్. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంతో బొత్సకు సంబంధాలున్నాయి. అదే ఆయనకు ప్లస్ పాయింట్. ఏ సమస్య ఉన్నా వెంటనే రియాక్ట్ అవుతారనే పాజిటివ్ టాక్ ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ నేత కళా వెంకట్రావు ఇక్కడ పోటీ చేయడం బొత్సకు అనుకూలంగా మారింది. టీడీపీ కేడర్ పూర్తి స్థాయిలో పని చేయడం లేదని ఆర్టీవీ స్టడీలో తేలింది. చీపురుపల్లిలో బొత్స మరోసారి గెలిచే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీ లెక్కలు చెబుతున్నాయి.
విజయనగరంలో..
విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ఎస్.కోట. ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. వైసీపీలో గ్రూపులు, కేడర్‌లో చీలిక టీడీపీకి కలిసి వచ్చే అంశాలు. ఎస్.కోటగా జనం పిలుచుకునే శృంగవరపుకోట తెలుగుదేశానికి కంచుకోట. కేడర్ బలంగా ఉండటం టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారికి ప్లస్. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుబ్బలక్ష్మి చేరడం టీడీపీకి సానుకూలాంశం. మరోవైపు వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు ఈ ఐదేళ్లు సరిగ్గా పని చేయలేదనే టాక్ జనంలో ఉంది. YCPలో విభేదాలు, జనంలో అసంతృప్తి టీడీపీ అభ్యర్థి విజయానికి బాటలు వేసినట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.
ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా..
కురుపాంలో టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి, పార్వతీపురంలో టీడీపీ అభ్యర్థి బోనెల విజయ్, సాలూరు వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర, బొబ్బిలి వైసీపీ అభ్యర్థి వెంకట చిన అప్పలనాయుడు..
గజపతినగరం వైసీపీ బొత్స అప్పలనర్సయ్య, నెల్లిమర్ల వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు, విజయనగరం వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి విజయం సాధించే అవకాశం ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.