/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-Polling-.jpg)
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేసింది ఈసీ. 14 సమస్యాత్మక నియోజకవర్గాలపై స్పెషల్ నిఘా ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గాల్లో CRPF బలగాలను ఈసీ మోహరించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో అత్యధికంగా.. తిరుపతి అసెంబ్లీ స్థానంలో 46 మంది పోటీ చేస్తున్నారు.
అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీలో ఉన్నారు. 25 ఎంపీ స్థానాల బరిలో 454 మంది పోటీలో ఉన్నారు. అత్యధికంగా నంద్యాల స్థానంలో 31 మంది పోటీ చేస్తున్నారు. కడప లోక్‌సభ బరిలో 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు:4,14,01,887
పురుషులు: 2,03,39,851
మహిళలు:2,10,58,615
ఇతరులు: 3,421