Andhra Pradesh : ఏపీలో రేపు 175 అసెంబ్లీ(Assembly), 25 ఎంపీ స్థానాలకు పోలింగ్(Polling) జరగనుంది. సెక్టార్ల వారీగా ఈవీఎంల(EVM) పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. సాయంత్రానికల్లా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం పోలింగ్‌కు ముందు మాక్ పోలింగ్ చేస్తారు. ఏపీలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది 224 పోలింగ్ కేంద్రాలను పెంచింది ఈసీ. 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. 14 సమస్యాత్మక నియోజకవర్గాలపై నిఘా ఏర్పాటు చేసింది ఈసీ. ఆ నియోజకవర్గాల్లో CRPF బలగాలను మోహరించారు.
Also Read : టీడీపీ నాయకులపై వైసీపీ నేతల దాడి..
మొత్తం 2,387 అభ్యర్థులు..
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతిలో 46 మంది పోటీలో ఉండగా.. అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఇంకా.. 25 ఎంపీ స్థానాలకు 454 మంది బరిలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా నంద్యాల పార్లమెంట్(Nandyal Parliament) స్థానంలో 31 మంది పోటీలో ఉండగా.. అత్యల్పంగా కడప లోక్‌సభ బరిలో 14 మంది అభ్యర్థులు ఉన్నారు.