/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Narasapur-MP-jpg.webp)
Bhupathiraju Srinivasa Varma: నరసాపురం ఎంపీగా తన గెలుపు గెలుపు ఖాయం అయ్యిందని బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు. తనకు రాజకీయాలు కొత్త కాదన్నారు. విద్యార్థి దశలో ఉద్యమాల నుంచి పుట్టిన నాయకుడిని తానన్నారు. గతంలో ఎంపీలుగా పోటీ చేసిన కృష్ణంరాజు, గోకరాజు గంగరాజు గెలుపులో తాను కీలక పాత్ర పోషించానని గుర్తు చేశారు. మిత్ర పక్షాలతో ఎలా వెళ్ళాలనే విషయంపై తనకు అనుభవం ఉందన్నారు శ్రీనివాసవర్మ. నరసాపురం (Narasapuram) పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక కార్యక్రమాలు జరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్నారు. శ్రీనివాసవర్మ ఆర్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను కింది వీడియోలో చూడండి.