/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Elections-Money.jpg)
ఏపీలో ఎన్నికలకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగలడంతో ప్రధాన పార్టీలు పైసల పంపకంపై దృష్టి సారించాయి. అనేక చోట్ల ఓటుకు రూ.2 వేలకు పైగానే ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టఫ్ ఫైట్, ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉన్న చోట్ల ఓటుకు రూ.13 వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని చోట్ల తమకు డబ్బులు రాలేదని ఓటర్లు ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా మైలవరంలో తమకు డబ్బులు రాలేదని వైస్సార్ కాలనీకి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. అందరికీ డబ్బులు ఇచ్చిన ప్రధాన పార్టీల నాయకుతు తమకు ఇవ్వలేదని వారు నిరసన చేపట్టారు. దీంతో ఇరు పార్టీల నేతలు వచ్చి వారికి సర్దిచెప్పడంతో ఇల్లకు వెళ్లిపోయారు.